NZB: నిజామాబాద్ నుంచి డిచ్పల్లి వైపు వెళ్లే మార్గమధ్యంలో ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. మార్గమధ్యంలో నడిపల్లి గ్రామం దాటిన తర్వాత పెట్రోల్ పంపు వద్ద గల మలుపు దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.