MNCL: విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు అర్ధమయ్యేలా బోధించాలని లక్షెట్టిపేట మండల ఎంఈవో శైలజ సూచించారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. సందర్భంగా ఉపాధ్యాయులకు ఆమె సూచనలు చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల గ్రహణ శక్తి సామర్ధ్యాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దీన ఉన్నారు.