BDK: అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం ( స్త్రీసంఘటన) జిల్లా కార్యదర్శి మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ పట్టణంలో కుంజ సోమక్క, మమత మాట్లాడుతూ.. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రిలో వెనకబడిన ఆదివాసి గ్రామాలలో ఒక్కో ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు జీవిస్తూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.