W.G: భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన పీసీపీఎన్డీటీ జిల్లా సలహా సంఘం సమావేశం నిర్వహించారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టం అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్త స్కానింగ్ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన 4 దరఖాస్తులు, 2 పునరుద్ధరణ దరఖాస్తులు, 4 మార్పుల దరఖాస్తుల అనుమతులపై చర్చించినట్లు తెలిపారు.