KMM: ప్రభుత్వాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం నేలకొండపల్లి రావెళ్ళ సత్యం భవనంలో జరిగిన సీఐటీయూ మండల మహాసభలో మాట్లాడారు. కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.