NDL: పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు స్వామి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా దేవదాయ శాఖ డివిజన్ అధికారి హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం ఆదాయం రూ. 24,69,247 నగదు, 10 గ్రాముల బంగారం, 747 గ్రాముల వెండి వచ్చినట్లు డివిజన్ అధికారి హరిచంద్ర రెడ్డి తెలిపారు.