NZB: బీడీ కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఆర్థిక దోపిడీ చేస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి పలువురు విన్నవించారు. మంగళవారం ఆయనకు వివిధ పార్టీల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీడీ ఫెడరేషన్ అధ్యక్షుడు పోశెట్టి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహేర్, జడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్ రావు ఉన్నారు.