MNCL: జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రతి మంగళవారం జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా వారం సంత జరుగుతుంది. అయితే సంతలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉండటం, వాహనాలు ఒకేసారి రావడంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ధర్మారం చౌరస్తా, అంగడి బజార్, కవ్వాల్ చౌరస్తా ప్రాంతాలలో వాహనాలు నిలిచిపోయాయి.