ELR: కేపీడీటీ హైస్కూల్లో బుధవారం జాబ్ మేళా జరుగుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి ఇవాళ తెలిపారు. 17 కంపెనీలలోని 1,205 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ, ఎంబీబీఎస్, బీటెక్ వరకు వివిధ విద్యార్హతలు గల 18 – 35 ఏళ్ల యువత హాజరు కావాలని ఆయన అన్నారు.