కోనసీమ: విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై ప్రాథమిక అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో ఉపాధ్యాయులతో కెరీర్ గైడెన్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రక్రియ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు.