BPT: అద్దంకి ఎంపీపీ అవిశన జ్యోతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం జరగనుందని ఎంపీడీవో వరూధిని తెలిపారు. ఈ భేటీలో ముఖ్యంగా తుఫాను వల్ల దెబ్బతిన్న గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, శానిటేషన్ అంశాలపై చర్చిస్తారన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలతో అధికారులు తప్పక హాజరు కావాలని ఆమె కోరారు.