SRCL: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో నిర్వహిస్తున్న ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, కొనుగోళ్లు పరిశీలించారు. రైతులకు అన్ని వసతులు కల్పించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి తరలించాలని అధికారులకు సూచించారు.