కోనసీమ: పీ.గన్నవరం మండలంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్ధులకు మండల స్థాయిలో నైపుణ్య పోటీలు మంగళవారం ఏర్పాటు చేశారు. ఎస్.ఎస్.ఏ ఆధ్వర్యంలో విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు పలు రంగాలలో రూపొందించిన ప్రదర్శనలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటిలో మెరుగైన వాటిని గుర్తించి, ఆ విద్యార్థులకు అవార్డులు అందజేశారు.