CTR: పులిచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన బుధవారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజశేఖర్ బాబు తెలిపారు. అయితే ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తప్పక హాజరు కావాలన్నారు.