NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. నిన్న సాయంత్రం వరకు మూసీకి 3,936 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్ట్ మూడు క్రస్ట్ గేట్లను పైకెత్తి 3,870 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 23 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.