NLG: ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం యాసంగి బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఈ రోజు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బోనస్ విడుదల చేసేందుకు కృషిచేయాలని వినతిపత్రం సమర్పించారు.