NLR: కావలి ఎక్సైజ్ శాఖ పరిధిలోని బోగోలులో మద్యం దుకాణానికి రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా అధికారి శ్రీనివాసులు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 10వ తేదీలోగా ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను కావలి ఎక్సైజ్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈనెల 12న కలెక్టర్ కార్యాలయ ఆవరణలో లాటరీ తీస్తారని తెలిపారు.