PLD: నరసరావుపేట మండలం కాకానిలోని JNTU కళాశాలను మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుతో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాల పెంపుతో పాటు హాస్టల్, ప్రొఫెసర్ క్వార్టర్స్, స్పోర్ట్స్ మైదాన నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్‌ను పరిశీలించారు.