KMR: జక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం నియోజకవర్గ పర్యటన అనంతరం మన్మథ్ స్వామి దర్శనం కోసం అనుచరులతో కలిసి కపిల్ దారు బయలుదేరారు. మార్గమధ్యంలో కపిల్ దార్‌కు పాదయాత్ర చేస్తున్న సద్గురు సోమాయప్పని ఎమ్మెల్యే కలిశారు. అనంతరం కపిల్ దార్‌కు చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మన్మథ్ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.