VZM: కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా కల్పించే సబ్సిడీ రుణాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. శనివారం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీంలో భాగంగా జామి మండలం రామయ్యపాలెం గ్రామానికి చెందిన ఎన్. ఎర్నిబాబు సబ్సిడీ పొందిన ఆటోను తన చేతుల మీదుగా లబ్దిదారుడుకి అందజేశారు.