2025 మూడో త్రైమాసికంలోనూ ఇళ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 87,603 యూనిట్ల మేర ఇళ్లు అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. నగరాల వారీగా ఇళ్ల అమ్మకాల్లో 24,706 యూనిట్లతో ముంబై టాప్లో ఉంది. తర్వాత స్థానాల్లో బెంగళూరు(14,538 యూనిట్లు), ఢిల్లీ(12,955 యూనిట్లు), చెన్నై(4,617 యూనిట్లు) ఉన్నాయి.