RCB మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఆ జట్టుకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా కన్నడ రాజ్యోత్సవం పురుస్కరించుకుని RCB సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో స్మృతి మినహా RCB స్టార్ ప్లేయర్లంతా కనిపించారు. దీంతో ఆమె జట్టను వీడుతుందనే సందేహాలు మొదలయ్యాయి. అయితే, ప్రపంచకప్ టోర్నీతో బిజీగా ఉండటంతో ఆమె ఫ్రాంఛైజీకి అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.