W.G: భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠం కోసం శనివారం దాతలు మొత్తం 208 గ్రాముల వెండిని విరాళంగా అందించారు. పట్టణానికి చెందిన గణేశుల ఆనంద్, ఉమా దేవి దంపతులు 108 గ్రాములు, అల్లూరి కృష్ణ చైతన్య వర్మ 100 గ్రాములు అందించారు. ఆలయ ఆర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, దాతలకు ఆశీర్వచనాలు అందించారు.