WGL: భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చోటుచేసుకున్న నష్టాలపై వరంగల్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్షాల వల్ల పౌర, వ్యవసాయ, విద్యుత్,తదితర రంగాల్లో వాటిల్లిన నష్టాలపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించి, చర్యలు చేపట్టాలన్నారు.