SDPT: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రైతులు ఎవరు ఆధైర్యపడరాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్టోబర్ 29న ఇంతకుముందు ఎన్నడు లేని విధంగా సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం దానికి తగు చర్యలు తప్పకుండా తీసుకుంటుందని తెలిపారు.