TG: నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు చిట్యాల వద్ద రైలు అండర్ బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి నార్కట్పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.