SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో కూటమి నాయకులు శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతినెలా ఒకటవ తేదీన పింఛన్లు పంపిణీ చేయడంతో వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుంటుకు సంతోష్ కుమార్, ఎడ్ల రామారావు, కామర్స్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.