CTR: బంగారుపాళెం (M) తంబుగానిపల్లి వద్ద శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పడంతో తుంబకుప్పానికి చెందిన ఉమాశంకర్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం CMC హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.