GDWL: బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులను అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు శనివారం గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్లను అడిగి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.