కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ,మండపేట జనసేన ఇంఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీ సమేతంగా దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఛైర్మన్, ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందించారు.