ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి జర్మనీలో శస్త్రచికిత్స జరిగింది. భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన అక్కడ చికిత్స తీసుకున్నారు. సర్జరీ విజయవంతం కావడంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి తాడిపత్రికి రానున్నట్లు సమాచారం.