KMR: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. శనివారం మల్లూరు తండాకు చెందిన ధరావత్ విట్టల్కు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేసినట్లు వెల్లడించారు.