సినీ ప్రేక్షకులను అలరించిన హర్రర్ ఫ్రాంచైజీలో ‘కాంచన’ ఒకటి. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి మూడు పార్ట్లు రాగా.. త్వరలోనే ‘కాంచన 4’ రాబోతుంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్స్ షేర్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.