VZM: బాడంగి మండలం, బొత్సవానివలస గ్రామంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పింఛన్లను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు, వృద్ధులకు ఆర్ధిక భరోసా ఉండేలా పింఛన్లను సకాలంలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాడంగి మండలం టీడీపీ అధ్యక్షులు తెంటు రవిబాబు పాల్గొన్నారు.