ముంబై విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. కొలంబో నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణీకురాలి నుంచి కాఫీ ప్యాకెట్లలో దాచిన తొమ్మిది పౌచ్‌లలో దాదాపు రూ.47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌ను తీసుకోవడానికి వచ్చిన వ్యక్తితో పాటు మొత్తం ఐదుగురిని DRI అధికారులు అరెస్టు చేశారు.