BPT: జాతీయ రహదారి అయిన అద్దంకిలో వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం భవాని సెంటర్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాజు, పోలీసు సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ మేరకు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అద్దంకిలో మినీ బైపాస్ రోడ్డును నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.