TG: దేవాదాయ భూముల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987లోని సెక్షన్ 83, 84 తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన వందల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీస్, హైడ్రాతో కలిసి కసరత్తు చేస్తోంది.