హిందీ భాషపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంగ్లం, హిందీ భాషలు తమ రాష్ట్ర పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీంతో భాష వివాదం మరోసారి చర్చకు వచ్చే అవకాశముంది.