NRML: జిల్లాలో తెల్ల బంగారం (పత్తి) కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 17 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 3 నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరుగనున్నాయి. 8-12 శాతం ఉన్న పత్తికి క్వింటాల్‌కు రూ.8110, ఆపైన తేమ ఉంటే ఒక శాతానికి రూ.81 చొప్పున తగ్గించనున్నారు.