అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి పాకిస్తాన్ను దుయ్యబట్టింది. పాకిస్తాన్ అనుసరిస్తున్నది కపటనీతి అంటూ ధ్వజమెత్తింది. పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను వెంటనే ఆపాలని గట్టిగా డిమాండ్ చేసింది. PoKలో ప్రజలపై దాడులు, అణచివేత వంటి చర్యలను పాక్ ఆపాలని తేల్చి చెప్తూ.. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చర్యలను భారత్ ఎండగట్టింది.