AP: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు క్షతగాత్రులకు సత్వర చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రి అచ్చెన్న, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో మాట్లాడి తగు సూచనలు చేసినట్లు లోకేష్ పేర్కొన్నారు.