NZB: బోధన్ పట్టణంలోని సరస్వతినగర్‌లో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుత్ తీగలు, మీటర్ బాక్స్ కొంత మేరకు దెబ్బతిన్నాయి.