నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 69వఉమ్మడి జిల్లా ఫుట్ బాల్ సెలక్షన్స్లో హుజూర్నగర్ సోషల్ వెల్ఫెర్ విద్యార్థి దత్తు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. దీంతో దత్తును కళాశాల ప్రిన్సిపల్ దున్నవెంకటేశ్వర్లు, పీడీ ఆంజనేయులు, పీఈటీ రాములు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. దత్తు రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని వారు ఆకాంక్షించారు.