దేశంలోనే అత్యంత దుర్భర దారిద్య్రాన్ని(Extreme Poverty) పూర్తిగా తీసేసిన మొదటి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. కనీసం ఆహారం, ఆశ్రయం వంటి ముఖ్యమైన అవసరాలను కూడా తీర్చుకోలేని దారుణమైన పేదరికాని ‘దుర్భర దారిద్య్రం’ అంటారు. ఈ ఘనత సాధించడం ద్వారా తమ రాష్ట్రం దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిందని సీఎం విజయన్ అన్నారు.