AP: పోలవరం విలీన మండలం వేలేరుపాడులో ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూసేకరణ, పునరావాస పరిహారం చెక్కుల పంపిణీ చేశారు. ‘ఈ ఏడాది జనవరిలో రూ.900 కోట్ల పరిహారం పంపిణీ చేశాం. ఇవాళ మరో రూ.1000 కోట్లు పంపిణీ చేశాం. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటే సమాంతరంగా నిర్వాసితులకు సమప్రాధాన్యత ఇస్తాం’ అని వెల్లడించారు.