కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏలోని ఈత కొలనులో ఈనెల 2న బాల,బాలికలకు జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ కార్యదర్శి ఐ.రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెంది, 2008 నుంచి 2018 సంవత్సరాల మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ప్రతి ఒక్కరూ ధ్రువీకరణపత్రాలతో రావాలన్నారు.