టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన BCCI.. అయ్యర్ కోలుకుంటున్నాడని తెలిపింది. అయితే పూర్తిగా ఫిట్నెస్ సాధించేవరకు అతను సిడ్నీలోనే ఉంటాడని పేర్కొంది. కాగా OCT 25న ఆసీస్తో 3వ వన్డేలో బంతి బలంగా పక్కటెముకలకు తగటడంతో అయ్యర్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.