పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. లీటరు పెట్రోల్ ధర రూ.265.45గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.278.44 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ పెంపు జరిగింది. దీని వల్ల పాక్ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్కు ఇది మరింత నష్టం కలిగించనుంది.