సిరిసిల్ల: పాఠశాలలో నిత్యం కోతుల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిరోజు కోతులు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదిలోకి కూడా కోతులు వస్తున్నాయని, దీంతో తాము భయాందోళనకు గురువుతున్నామన్నారు. తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయన్నారు.