HYD: జూబ్లీహిల్స్ ప్రజల నుంచి బీఆర్ఎస్కి విశేష స్పందన లభిస్తుందని షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. ఈరోజు రహమత్ నగర్ డివిజన్లోని గంగానగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి మాగంటి సునీతను గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ.. సబ్బండ వర్గాలకు మేలు చేసిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.